Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ మిఠాయి ధర కేవలం 1.23 లక్షలే

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 1:01 PM జాతీయంGeneral
ఈ మిఠాయి ధర కేవలం 1.23 లక్షలే - Udayam
దీపావళి సందర్భంగా రాజస్థాన్‌లోని జైపుర్‌లో వినూత్నమైన బంగారు నాణెం ఆకారపు మిఠాయిని తయారు చేశారు. ‘త్యోహార్‌ అషర్ఫీ’ పేరుతో విక్రయిస్తున్న ఈ బాదం స్వీటులో తినదగిన బంగారాన్ని కలిపి, కుంకుమపువ్వుతో అలంకరించారు. కిలో ధర ఏకంగా రూ.1.23 లక్షలుగా నిర్ణయించారు. రాజుల కాలం నాటి బంగారు నాణేల సంప్రదాయాన్ని మిఠాయి రూపంలో చూపించాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు దుకాణ యజమానురాలు అంజలి జైన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...