Back to feed
డైట్ కళాశాలల్లో 86 అధ్యాపక పోస్టుల భర్తీ
Rohit Jun 19, 2026 9:05 AM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago

తెలంగాణలోని డైట్ కళాశాలల్లో 86 అధ్యాపక పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 23 సీనియర్ లెక్చరర్, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ట వయస్సును 44 ఏళ్లుగా నిర్ణయించారు.
ఈ నెల 24 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.
Comments
Loading comments...



