వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి, పరిగి మండలం బీరేపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం, మౌలిక వసతులు కల్పించాలని ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో పుట్టపర్తి రెవెన్యూ భవనం ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
సుమారు 30 మంది విద్యార్థులు చెట్ల కిందే చదువుకుంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను కలిసి సమస్య వివరించగా, నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

