Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ వాటర్‌తో ఇబ్బందులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 9:50 AM హైదరాబాద్General
డ్రైనేజీ వాటర్‌తో ఇబ్బందులు - Udayam
జిల్లెలగూడ వివేక్ నగర్ కాలనీలో కొద్దిరోజులుగా డ్రైనేజీ పారుతోంది. దీంతో ఈ రోడ్ గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నడుస్తుంటే మురుగునీరు మీద చిమ్ముతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలను ఆడుకునేందుకు బయటకు పంపలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. సంబంధిత మున్సిపల్ సిబ్బందితో సమస్యను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...