వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్, ప్యాపిలి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ధర్నా.
డోన్ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి డోన్, ప్యాపిలి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

