వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణానికి తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్‌కు బండగట్టు వద్ద లీకేజీ ఏర్పడినట్లు తెలిపారు. దీంతో పైప్‌లైన్‌పై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, పంప్‌హౌస్ సిబ్బంది కలిసి మరమ్మతు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రేపు 7 వ తేదీన డోన్ పట్టణంలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, 8 వ తేదీన యధాతధంగా నీరు వస్తాయని ప్రకటించారు. ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.
Comments
Loading comments...

