Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదయాత్ర భక్తులకు అన్నదానం చేసిన మాజీ సైనికులు

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:55 PM మెదక్General
పాదయాత్ర భక్తులకు అన్నదానం చేసిన మాజీ సైనికులు - Udayam
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మాజీ సైనికులు దసరా సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవానీమాత దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు భోజనం అందించారు. హైదరాబాద్‌-ముంబయి 65వ జాతీయ రహదారిపై ఆదివారం 30 మందికి పైగా మాజీ సైనికులు కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సేవను కొనసాగించడంపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...