వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం ఆయా పార్టీల నాయకులు ప్యాపిలిలో ఆందోళన నిర్వహించి తహసీల్దార్ భారతికి వినతి పత్రం అందజేశారు. వర్షభావం కారణంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహారిస్తోందని వారు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.
Comments
Loading comments...

