వార్తలకు తిరిగి వెళ్లండి

“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తిలో దాశరథి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తన కలం, గళంతో స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ప్రజల్లో రేకెత్తించిన మహనీయుడు దాశరథి అని కొనియాడారు. కార్యక్రమంలో రాములు గౌడ్, రమేశ్ గౌడ్, శ్రీను, వెంకన్న, వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

