వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు శుక్రవారం అర్ధరాత్రి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ వీరేందర్ కుమార్ తీవ్రంగా గాయపడి లారీ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. మెరుగైన చికిత్స కోసం అతడిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

