వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లయిన సందర్భంగా చీపురుపల్లిలో టీడీపీ నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేని స్కిల్ కేసులో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడిందని ఎమ్మెల్యే కళా వెంకటరావు విమర్శించారు.
73 ఏళ్ల వయసులో 53 రోజులు జైల్లో ఉంచడం అన్యాయమని, ప్రజాక్షేత్రంలో వైకాపాకు ప్రజలు తగిన తరిమి కొట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

