వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వచ్చి ఆరు రోజులైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని కామనగరువు గ్రామస్థులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. చల్లపల్లి రోడ్డులోని మెయిన్ విలేజ్‌కు కరెంట్ ఇచ్చి, సామిల్లు ప్రాంతానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు, లైన్‌మెన్ వైఖరిని నిరసిస్తూ చల్లపల్లి రోడ్డుపై, కామనగరువు సబ్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

