వార్తలకు తిరిగి వెళ్లండి

పౌరసత్వ నిర్ధారణ, విదేశీయులుగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో స్వల్ప స్పెల్లింగ్ పొరపాట్ల కారణంగా విదేశీయులుగా ముద్రపడిన అస్సాంకు చెందిన 27 మందికి రక్షణ కల్పిస్తూ ఊరటనిచ్చింది.
చట్టవిరుద్ధంగా పౌరసత్వం పొందకుండా నిరోధించే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, న్యాయ ప్రక్రియే అత్యున్నతమైనదని తెలిపింది. ట్రైబ్యునళ్లు మళ్లీ విచారించే వరకు ఆ 27 మందిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Comments
Loading comments...

