Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞాపకాలు కోల్పోతే ఆ ప్రేమ దక్కేనా?

Follow Udayam Digital on Google
Priya Singh Jun 16, 2026 10:26 AM ఆల్ ఇండియావినోదం
జ్ఞాపకాలు కోల్పోతే ఆ ప్రేమ దక్కేనా? - Udayam Digital
విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నూతన ఓటీటీ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ వేదికగా జులై 3 నుంచి ప్రసారం కానుంది. పెళ్లికి ముందు ప్రమాదంలో జ్ఞాపకాలు కోల్పోయిన యువకుడు, తన ప్రేమను తిరిగి పొందేందుకు చేసిన భావోద్వేగ పోరాటం నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఆహ్లాదకరమైన సంభాషణలతో కూడిన ఈ చిత్ర టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Comments

G
Loading comments...