Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తాగేందుకయినా నీళ్లు లేవు, ప్రభుత్వ హాస్టల్ దుస్తితి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 10:39 AM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో తాగేందుకు నీళ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంకు వెళ్లేందుకు కూడా నీళ్లు లేక సమీప పోలీస్ స్టేషన్, ఎంఆర్‌సీ భవనం నుంచి తెచ్చుకుంటున్నారు. ఏడాదిగా బోరు పాడైనా మరమ్మతులు చేయలేదని, మిషన్ భగీరథ నీరు రావడం లేదని విద్యార్థులు తెలిపారు. కలెక్టర్ నిధులు విడుదల చేసినా పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...