వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.ఖాసీం తెలిపారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. డయేరియా, ఫైలేరియా,
మలేరియా, డెంగ్యూ, టీబీ, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి, తగిన జాగ్రత్తలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

