Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాలతో NHM ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 5:34 PM వనపర్తిGeneral
బోనాలతో NHM ఉద్యోగుల నిరసన - Udayam
వనపర్తి మర్రికుంట ధర్నా చౌక్‌లో డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులు 22వ రోజు వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగులు బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ రఘు, హరీష్‌, అనిత, జేఏసీ నాయకులు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...