వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలు మండలంలో ఉల్లి ధరలు కిలో రూ.70కి చేరువై సామాన్యులకు భారంగా మారాయి. రెండు నెలల క్రితం రూ.25గా ఉన్న కిలో ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగింది.
మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లలో రాయితీపై ఉల్లిపాయలు అందిస్తామని అధికారులు ప్రకటించినా, అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...

