Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్ మానేసి చోరీలు.. యువతి అరెస్టు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:42 PM హైదరాబాద్General
బీటెక్ మానేసి చోరీలు.. యువతి అరెస్టు - Udayam
బీటెక్ చదువు మధ్యలో ఆపేసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పాగ జయ (25)ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. బురఖా ధరించి హ్యాండ్ కట్టర్‌తో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబరు 26న ఉప్పల్‌లో 48 తులాల బంగారం, వెండి, రూ.2 లక్షల నగదు చోరీ చేసినట్లు వెల్లడించారు. ఐదు చోరీల కేసుల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...