Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 11:10 AM మహబూబ్‌నగర్General
భార్యపై భర్త దాడి.. కేసు నమోదు - Udayam
భార్యపై భర్త దాడి చేసి గాయపరిచిన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. వీరన్న పల్లి గ్రామానికి చెందిన పూజ, శ్రీను భార్య భర్తలు. వీరికి 5 నెలల పాప ఉంది. ఈనెల 15వ తేదీన నీవంటే.. నాకు ఇష్టం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని పూజాను కర్రతో చేతిపై, కాళ్లపై కొట్టాడని బాధితురాలు పూజ ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...