వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండలంలోని నాలుగు క్లస్టర్లలో గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల్లో టాయిలెట్లు, బాత్రూంలు అసంపూర్తిగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. బెజ్జూర్‌లో రైతు వేదిక పూర్తయినా కనీస సౌకర్యాలు లేక సమావేశాలకు వచ్చే రైతులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
గుత్తేదారుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని మండల రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

