వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్ మసాలా, గుట్కా, వక్కపొడి వంటి ఉత్పత్తుల్లో మత్తు పదార్థాలు కలుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇది నిజమని తేలితే, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాన్ మసాలా, గుట్కాల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
బెంగళూరులో ఇటీవల జరిగిన 'నషా ముక్త్ భారత్' మరియు రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రహిత కర్ణాటక నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా యువతను వ్యసనాలకు దూరం చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

