వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా మోపాల్ - సిర్పూర్ గ్రామాల మధ్య రోడ్డు పక్కన ముళ్లపొదల్లో బుధవారం నవజాత ఆడ శిశువు సజీవంగా లభ్యమైంది. శిశువు ఏడుపు గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకుని శిశువును జిల్లా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం జన్మించిన ఆ పాప ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

