Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీనగర్ పాఠశాల అప్‌గ్రేడ్‌కు వినతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:32 PM ఏలూరుGeneral
బాలాజీనగర్ పాఠశాల అప్‌గ్రేడ్‌కు వినతి - Udayam
జంగారెడ్డిగూడెంలోని బాలాజీనగర్ ఎంపీపీ పాఠశాలను యూపీ లేదా జడ్పీహెచ్‌గా అప్‌గ్రేడ్ చేయాలని డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం అందజేసింది. ఐదో తరగతి తర్వాత విద్యార్థులు ప్రమాదకరమైన రహదారి దాటి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని సంఘం నేతలు రంగా, ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...