వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుల సమస్యలను సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే స్పందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

