వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తికి చెందిన రైతు కిష్టయ్య ధాన్యంలో 50 బస్తాలను తరుగు కింద కోత విధిస్తామని మిల్లు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ధాన్యం తడిసిందనే సాకుతో అధికారులు కూడా దీనిని సమర్థించడం బాధిత రైతును ఆవేదనకు గురిచేసింది.
ప్రభుత్వం ధాన్యం కొంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మిల్లుల నిర్వాకం వల్ల రైతులు నష్టపోతున్నారు. అధికారుల దోబూచులాటతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత రైతు తన గోడును వెళ్లబోసుకున్నారు.
Comments
Loading comments...

