వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట (M) గులుమూరు గ్రామానికి చెందిన సవర సిద్దు(4) మంగళవారం ఉదయం అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురై సీతంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్ఐ అమ్మనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందంతో అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం 11 గంటలకు గులుమూరు అటవీ ప్రాంతంలో బాలుడు క్షేమంగా లభ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

