Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌లో మళ్లీ బ్లూ జెర్సీ

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:14 PM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్‌లో మళ్లీ బ్లూ జెర్సీ - Udayam
ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. హాకీ ఇండియా తొలి ఎంపికగా నీలం రంగును, రెండో ఎంపికగా కాషాయాన్ని సూచించినట్లు ట్రెజరర్ శేఖర్ మనోహరన్ తెలిపారు. గత హాకీ ప్రపంచకప్‌లో కాషాయ జెర్సీని ఉపయోగించడంపై విమర్శలు వచ్చాయి. నీలం రంగు సింథటిక్ మైదానంతో కలిసిపోవడం వల్లే కాషాయాన్ని ఎంపిక చేసినట్లు హాకీ ఇండియా అప్పట్లో వివరణ ఇచ్చింది.

Comments

G
Loading comments...