Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల తీరుపై కవిత ఫైర్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 2:29 PM హైదరాబాద్General
తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీనియర్ మహిళా ఎమ్మెల్యేలను నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించారు అని ఆమె విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడులకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై హింస, దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...