వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నాలుగో రోజు పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. యాగశాలలో చతుస్థానార్చన, మూర్తి కుంభారాధన, హోమం నిర్వహించి లక్ష తులసి అర్చనతో స్వామివారిని పూజించారు.
చిన్నశేష వాహనంపై వటపత్రశాయిగా అలంకరించిన స్వామివారిని ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. సాయంత్రం సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
Comments
Loading comments...

