Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో భార్యను సజీవదహనం చేసిన భర్త

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:42 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా జగత్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య సోనమ్‌ను భర్త సుఖ్‌వీర్ సింగ్ కుర్చీకి కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం నిందితుడు పిల్లలను తీసుకుని పరారైనట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...