Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు చేయాలి: యాకయ్య

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 6:46 PM మహబూబాబాద్ General
 అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలు చేయాలి: యాకయ్య - Udayam
అమరవీరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో ప్రజా విముక్తి కోసం పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకుడు సెగ్గెం యాకయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కుమ్మరికుంట్ల గ్రామంలో జెండా ఆవిష్కరించారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, కనీస వేతనాలపై పోరాటాలు కొనసాగించాలని యాకయ్య అన్నారు. కార్యక్రమంలో ఏరుగొండ శ్రీను, ఉప్పలయ్య, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...