వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి మండలం అమృతాపూర్‌లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న గంగారం, ఉపసర్పంచ్ సాయిచరణ్, కార్యదర్శి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

