Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో విమాన ప్రమాదం.. చిన్నారితో సహా ఆరుగురు మృతి

Follow Udayam on Google
Harika Oct 15, 2026 12:49 PM అంతర్జాతీయంGeneral
అమెరికాలో విమాన ప్రమాదం.. చిన్నారితో సహా ఆరుగురు మృతి - Udayam
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం డెల్లోనా పట్టణ సమీపంలో పైపర్ పీఏ-46 విమానం దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సౌక్ కౌంటీ షెరీఫ్ విభాగం వెల్లడించింది. ప్రమాద సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. FAA, NTSB అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...