Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి: అక్రమ మట్టి రవాణా చేస్తున్న రెండు టిప్పర్లు సీజ్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jun 27, 2026 11:56 AM అమరావతిGeneral
అమరావతి: అక్రమ మట్టి రవాణా చేస్తున్న రెండు టిప్పర్లు సీజ్ - Udayam
అమరావతి రాజధాని గ్రామాల పరిధిలో అనుమతులు లేకుండా నల్ల మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తుళ్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటపాలెం వెస్ట్ బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేసి, అక్రమ రవాణాను గుర్తించామని ఎస్సై మురళీధర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఖనిజ సంపదను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...