వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు నుంచి కురుమూర్తికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు, పొదలు రోడ్డుపైకి అడ్డంగా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై మలుపులు ఉన్న ప్రాంతాల్లో చెట్లు అడ్డుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి
రాత్రి వేళల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

