వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దండ మండలంలోని నగరగడ్డ తండాలో నిర్మిస్తున్న శ్రీ మేరామయడి నూతన ఆలయ నిర్మాణానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్, జూపల్లి భాస్కర్‌రావు రూ. 51,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా తండా నాయకులతో మాట్లాడి ఆలయ నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సహకారం అందించిన ఆయనకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

