Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమూరులో గురజాడ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:18 PM కోనసీమGeneral
ఆలమూరులో గురజాడ జయంతి వేడుకలు - Udayam
ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఏ.రాజు, ఎంఆర్ఓ కె.కుశరాజు, ఎంఈఓ బి.అప్పాజీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్య, సమాజ శ్రేయస్సు, మానవతా విలువల కోసం గురజాడ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...