Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్ మృతి

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 9:09 AM నిర్మల్General
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్ మృతి - Udayam
నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కన ఆగి ఉన్న టీఎస్ 07 యూజీ 8389 లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్జే 11 జీడీ 5457 లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక నిలబడి ఉన్న రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ ఉరుపాల్ సింగ్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...