Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ గుర్తింపు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 12:19 PM గుంటూరుఆంధ్రప్రదేశ్
ఆచార్య నాగార్జున వర్సిటీ ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ గుర్తింపు - Udayam
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ విద్య డైరెక్టర్ పాల్ కుమార్ సౌత్ కొరియాకు చెందిన ‘వరల్డ్ సొసైటీ ఫర్ పీస్ స్పోర్ట్స్’ ఇండియా కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వర్సిటీకి అందాయి. అంతర్జాతీయ సంస్థలో సేవలు అందించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేయగా, వర్సిటీ వీసీ గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ ఆయనను మంగళవారం అభినందించారు.

Comments

G
Loading comments...