Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 గంటలుగా దంచి కొడుతున్న భారీ వర్షం

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 9:27 AM మంచిర్యాలతెలంగాణ
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో అతి భారీ వర్షం నమోదవుతుంది. మంగళవారం రాత్రి పది గంటలకు ప్రారంభమైన భారీ వర్షం బుధవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. 36 గంటల పాటు అతి భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. భారీ వర్షంతో జన్నారం మండలంలోని ప్రధాన, గ్రామీణ రోడ్లపై వంద నీరు ప్రవహిస్తోంది. వాగుల,ు వంకలలో వరద ఉధృతి కొనసాగుతోంది. అతి భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు బయటికి వెళ్ళవద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...