వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి సమీపంలోని అంకమ్మ చెరువు (పెద్ద చెరువు) కరకట్ట తెగడంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. చెరువు కింద ఉన్న వరి, ఇతర పంటలు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది.
చేపల చెరువులు ఉప్పొంగడంతో చేపలు వాగుల్లోకి కొట్టుకుపోయాయి. 1986లో తెగిన చెరువు కట్ట 40 ఏళ్ల తర్వాత మళ్లీ తెగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

