వార్తలకు తిరిగి వెళ్లండి
ఒక్కరోజులో 35కోట్ల మొక్కలు

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వృక్షారోపణ మహాయజ్ఞం 2026లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 35.2 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సృష్టించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా మొక్కలు నాటారు.
మరోవైపు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గంటలోనే 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన అధికారులకు, వాలంటీర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...