Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31 రకాల చెత్తను కొనుగోలు చేస్తాం: డీఎల్‌డీవో

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:26 PM కోనసీమGeneral
31 రకాల చెత్తను కొనుగోలు చేస్తాం: డీఎల్‌డీవో - Udayam
స్వచ్ఛ రథాల ద్వారా ప్రజల నుంచి 31 రకాల చెత్తను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీఎల్‌డీవో అబ్రహం లింకన్ తెలిపారు. ఎండగండి గ్రామపంచాయతీలో సోమవారం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. బిన్‌–బ్యాగ్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తడి చెత్తను బిన్‌లో, కొనుగోలు చేసే 31 రకాల చెత్తను బ్యాగ్‌లో వేయాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...