వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో సామాన్యుల భూములను చేర్చడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి బాధితులకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
అమాయకుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వారి మానవ హక్కులకు భంగం కలిగిస్తోందంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ నెల 14న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

