వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో కిరణ్మయి (26) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ రీఛార్జ్ చేయించలేదనే కారణంతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వెంకటేష్‌తో గొడవపడి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కేవలం రీఛార్జ్ విషయమే కారణమా లేక ఇతర కలహాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్న కారణంతో ప్రాణం పోవడం స్థానికులను కలచివేసింది.
Comments
Loading comments...

