Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు: మార్కెట్‌లో బస్తా నిమ్మకాయలు రూ. 10,000 పలుకుతున్నాయి.

Udayam Digital Staff Apr 04, 2026 5:57 AM అమరావతి 5 viewsabout 1 month ago
రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు: మార్కెట్‌లో బస్తా నిమ్మకాయలు రూ. 10,000 పలుకుతున్నాయి. - Udayam Digital
నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో శుక్రవారం రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. 80 కిలోల నిమ్మకాయల బస్తా ఏకంగా రూ.10,000 పలకడం విశేషం. గత పదేళ్లలో ఇంతటి గరిష్ట ధర ఎప్పుడూ లేదని అటు రైతులు, ఇటు వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దిిల్లీ మరియు ఈశాన్య ప్రాంతాల్లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయ రూ.5 వరకు విక్రయించబడుతోంది. దిగుబడులు తగ్గినా, గిట్టుబాటు ధర లభించడంతో మెట్ట ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...