వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.
ఇప్పటికే 17.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, రూ.2,310 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మొత్తం రూ.21 వేల కోట్లు కేటాయించామని, రవాణాకు ఆరు వేల వాహనాలను సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

