Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

"తీర్థయాత్రలో విషాదం: నియంత్రణ కోల్పోయి యాత్రికుల బస్సు బోల్తా, ఎనిమిది మందికి గాయాలు."

Udayam Digital Staff Apr 03, 2026 10:19 AM నిజామాబాద్ 6 viewsabout 1 month ago
"తీర్థయాత్రలో విషాదం: నియంత్రణ కోల్పోయి యాత్రికుల బస్సు బోల్తా, ఎనిమిది మందికి గాయాలు." - Udayam Digital
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున యాత్రికుల బస్సు బోల్తా పడింది. పటాన్‌చెరుకు చెందిన 35 మంది ప్రయాణికులు బడాపహాడ్ దర్గాకు వెళ్తుండగా, అటవీ ప్రాంతంలోని మూలమలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...