Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఎడ్లంకలో యువత సేవ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:57 PM కృష్ణా జిల్లాGeneral
పాత ఎడ్లంకలో యువత సేవ - Udayam
అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకలో రాకపోకలకు అడ్డుగా పెరిగిన ముళ్లకంపను గ్రామ యువత తొలగించింది. బుధవారం గోవర్ధన్ ఆధ్వర్యంలో యువకులు పారిశుద్ధ్య పనుల్లో స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. పంచాయతీ నిధుల కొరత నేపథ్యంలో గ్రామాన్ని తామే స్వచ్ఛంగా తీర్చిదిద్దుకుంటామని యువత తెలిపింది. ఇందులో భాగంగా వారానికి 2–3 రోజులు ‘స్వచ్ఛ ఎడ్లంక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొంది.

Comments

G
Loading comments...